
చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు చేసింది రియల్ టైమ్ పాలిటిక్స్...కాదా.. అని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాల, కాకినాడ గెలపులు కేవలం వాపే కాని బలుపుకాదన్నారు. టీడీపీ విజయాలను మహాభారతంలో జూదం ఆడి కౌవరవుల సాధించిన విజయంగా ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కాకాణి చంద్రబాబు పై విమర్శలు చేశారు.
చంద్రబాబు నాయుడు, కరువు కవలపిల్లలాంటివన్నారు. ఆయన ఎప్పుడు సీఎం అయినా కరువు కూడా రాష్ట్రంలో తాండవం చేస్తుందన్నారు. నేడు "జలసిరి హారతి" పేరుతో నదులకు పూజ చేయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఆక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే ప్రభుత్వానికి కనీసం అడిగే ధైర్యం లేదని మండిపడ్డారు.
చంద్రబాబుకు ప్రజల అభివృద్దిపై చిత్తశుద్ది లేదన్నారు. కేవలం పార్టీ బలోపెతమే ఆయన ద్వేయంగా కనిపిస్తోందని ఆరోపించారు. నంద్యాల కాకినాడ ఎన్నికలు చూస్తే చంద్రబాబులో ఉన్న అధికార దాహాం తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నంద్యాల్లో ఇంటికో మంత్రిని పెట్టి బ్లాక్ మెల్ చేసి గెలిచారన్నారు. నంద్యాల గెలుపు అస్సలు గెలుపే కాదని కాకాణి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలోలాగా ఓకే నియోజకవర్గంలో నేతలందరిని సాధారణ ఎన్నికల్లో మోహరించడం సాధ్యకాదన్నారు. 2019 కురుక్షేత్ర యుద్దంలో ప్రజలు ధర్మం వైపు ఉంటారని కాకాని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి