ఎన్నిక‌ల కోసం చంద్ర‌బాబు న‌మ్ముకున్న ఆ మూడు...!

Published : Sep 06, 2017, 01:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఎన్నిక‌ల కోసం చంద్ర‌బాబు న‌మ్ముకున్న ఆ మూడు...!

సారాంశం

చంద్రబాబు పై మల్లాది విష్ణు ధ్వజం. బాబులో అభద్రతాభావం పెరింగిందని వ్యాఖ్య. కేవలం డబ్బు, పోలవరం, పోలీసులతో ఎన్నికలకు సిద్దం.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం పోలీస్, పర్చేజ్, పోలవరంను నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నారని వైసీపీ నేత మ‌ల్లాది విష్టు ఎద్దేవా చేశారు. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీఎం ఈ మూడింటినే  అమ‌లు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న టీడీపీ పై విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబులో అభ‌ద్ర‌తాభావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. రెండు రోజుల టీడీపీ వ‌ర్క్ షాపులో వైసీపీ గురించే మాట్లాడుతున్నారంటే కార‌ణం అదే అని తెలిపారు. ప్ర‌జా అభివృద్ది మ‌రిచి తెలుగుదేశం కార్యకర్తలకే ఈ ప్రభుత్వం పనిచేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌చ్చ‌ నాయకుల కనుసన్నల్లోనే అన్ని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయ‌ని విష్టు ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిఎం రిలీఫ్ ఫండ్ ను టిడిపి నేత‌ల‌ సిఫార్సు లేకుండా ఒక్కరికైనా ఇచ్చారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజకీయ వివక్షత లేకుండా ప్రభుత్వ ఫలాలు అందరికీ ఇవ్వాలనే విషయం చంద్రబాబు కు ఇంత‌కాలానికి తెలిసింద‌న్నారు. పరిపాలన అస్తవ్యస్తంగా వున్నా దానిని సరిదిద్దుకోలేక పోతున్నారని ఆరోపించారు.


అదేవిధంగా పోలవరం కోసం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చి, మూడేళ్ల తరువాత సదరు కంపెనీని పక్కకుపెట్టార‌ని ఆయ‌న తెలిపారు. టిడిపి ఎంపి రాయపాటి తన ట్రాన్స్ స్టాయ్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రకటన చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదే విష‌యంపై సీఎం వివక్షత చూపుతున్నారంటూ ఎంపి రాయపాటి పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా.. అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి....

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి