
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో పాము కలకలం రేపింది. సాయంత్రం గర్భగుడిలోని క్యూలైన్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుండగా.. కొందరికి పాము కనిపించింది. వెంటనే వారు ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టడంతో కలకలం రేగింది. దీంతో ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు కర్రలు, గడ్డ పారలతో భక్తులకు ఎలాంటి హానీ కలగకుండా పామును తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్గగుడి కొండ మీద నుంచి ఆలయంలోకి పాము ప్రవేశించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.