హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు: ఉలిక్కిపడిన విశాఖ వాసులు

By Siva KodatiFirst Published May 21, 2020, 5:56 PM IST
Highlights

విశాఖలోని ఎల్జీ గ్యాస్ పాలిమర్స్‌‌ చోటు చేసుకున్న విషాదం నుంచి నగర ప్రజలు పూర్తిగా కోలుకోముందే హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో విశాఖ వాసులు భయాందోళనలకు గురయ్యారు

విశాఖలోని ఎల్జీ గ్యాస్ పాలిమర్స్‌‌ చోటు చేసుకున్న విషాదం నుంచి నగర ప్రజలు పూర్తిగా కోలుకోముందే హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో విశాఖ వాసులు భయాందోళనలకు గురయ్యారు.

హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. గోధుమ రంగు పొగలు దట్టంగా అలుముకున్నాయి. గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి వ్యాపించాయి.

Also Read:ఎల్జీ పాలీమర్స్ వద్ద ఉద్రిక్తత: ఫ్యాక్టరీ ముందు వెంకటాపురం వాసుల ధర్నా

అయితే కొద్దిసేపటికి పొగలు రావడం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఫ్లూయిడ్ క్యాటలిక్ క్రాకింగ్ సమయంలో దట్టమైన పొగలు వస్తాయని తెలిపారు.

కాగా ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగర ప్రజలు హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి భారీగా పొగలు రావడం చూసి భయాందోళనకు గురయ్యారు.

Also Read:విశాఖ గ్యాస్ లీక్: తగ్గని విషవాయువు ఎఫెక్ట్, సొమ్మసిల్లిన విఆర్వో, మరో ముగ్గురు

అయితే గతంలోనూ అదే విధంగా పొగలు వచ్చిన అధికారులు గుర్తుచేసుకున్నారు. కాగా, 2013 ఆగస్టు 23న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది కార్మికులు మరణించారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కూలింగ్ టవర్ పేలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. 

click me!