గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు..!

Published : Mar 04, 2021, 09:15 AM ISTUpdated : Mar 04, 2021, 09:17 AM IST
గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు..!

సారాంశం

ఆ చిన్నారికి పోలీసులు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆ బాలుడి కోరిక మేరకు కొద్ది సేపు అర్బన్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు.

గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్ అనే చిన్నారి బాధ్యతలు నిర్వర్తించాడు. రిహాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాగా.. ఆ చిన్నారికి పోలీసులు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆ బాలుడి కోరిక మేరకు కొద్ది సేపు అర్బన్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు.

అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి.. స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్ లో కూర్చోపెట్టారు. బాలుడిని తో పాటు తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్ లు కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారి కి కృతజ్ఞతలు తెలియజేశారు. తన కోరిక నెరవేరినందుకు ఆ చిన్నారి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం