గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా శివరామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.
గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కలకలం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా శివరామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు.
పోలీసులు దెబ్బలు తట్టుకోలేక శివరామకృష్ణ పురుగుల మందు తాగాడు. దీంతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.
అయితే శివరామకృష్ణ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రికి వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసలు స్టేషన్ లోకి పురుగు మందు ఎలా వస్తుందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులే కొట్టి చంపారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహాంతో డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కుటుంబసభ్యులు.