పలమనేరులో విద్యార్థిని ఆత్మహత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు.. అదే కారణమా..?

Published : Mar 24, 2022, 11:38 AM IST
పలమనేరులో విద్యార్థిని ఆత్మహత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు.. అదే  కారణమా..?

సారాంశం

చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మిస్బా మంగళవారం రోజున ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఆమె చనిపోయే ముందు రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మిస్బా మంగళవారం రోజున ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఆమె చనిపోయే ముందు రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖలో మిస్బా ప్రస్తావించిన అంశాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. తనకు స్నేహితులు ఎవరూ లేరంటూ మిస్బా ఆవేదన వ్యక్తం చేసింది. తాను బాగా చదివితే తోటి విద్యార్థి బాధపడేదని లేఖలో రాసుకొచ్చింది. చదువులో పోటీ కారణంగా తోటి విద్యార్థినితో సమస్యలు వచ్చినట్టు వెల్లడించింది.

వివరాలు.. పలమనేరు చెంది వజీర్‌ అహ్మద్‌, నసీమా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కూతురు మిస్బా.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మరికొద్ది నెలల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా.. పాఠశాల యజమాన్యం మిస్బాకు టీసీ ఇచ్చి వేరే స్కూల్‌కు పంపింది. కొత్త స్కూల్‌కు వెళ్తున్నప్పటికీ మిస్బా ముభావంగా ఉండేది. ఆ తర్వాత మూడు రోజులకే మిస్బా.. ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. పాఠశాల యజమాన్యం వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మిస్బా కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే తాజాగా వెలుగులోకి ప్రచారంలోకి వచ్చిన లేఖలో.. ‘‘నాన్నా.. నన్ను క్షమించు.. నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు.. కానీ నేను మానసిక సంఘర్షణ పడుతున్నాను. నేను బాగా చదవడమే నాకు ఇబ్బందిగా మారింది. నేను బాగా చదవడం వల్ల తోటి విద్యార్థిని బాధపడుతోందని.. ఆమె నన్న అర్థం చేసుకోలేకపోయింది’’ అని మిస్బా పేర్కొంది. అయితే లేఖలో మిస్బా ప్రస్తావించిన పేరు.. వైసీపీ నేత కుమార్తెది కావడంతో ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తన కూతురుకి పోటీగా వస్తుందని.. తన కూతురుకే ఫస్ట్ ర్యాంకు రావాలని వైసీపీ నేత ఒత్తిడి చేయడంతోనే.. పాఠశాల యాజమాన్యం మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

స్కూల్‌లో టాపర్ గా ఉండటమే శాపంగా మారిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక వైసీపీ నేత కూతురే స్కూల్లో టాపర్గా ఉండాలని ప్రిన్సిపాల్, సిబ్బంది ప్రయత్నించారని.. ఆ ఒత్తిడులు తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమవుతున్నారు.  

ఇక, మిస్బా కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి పరామర్శించారు. మిస్బా ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. మిస్బా రాసిన లేఖను పోలీసులు ఎందుకు దాచారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం