గుంటూరులో వాగులో పడ్డ వ్యాన్: ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

By narsimha lodeFirst Published Mar 1, 2020, 5:20 PM IST
Highlights

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ఆదివారం నాడు అతివేగంతో వ్యాన్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.


గుంటూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో ఆదివారం నాడు అతివేగంతో వ్యాన్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

ఆదివారం నాడు సాయంత్రం పుల్లడిగుంట వద్ద అతివేగంతో  వ్యాన్ నడిపాడు డ్రైవర్ ఈ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో వ్యాన్ వాగులో పడిపోయింది. దీంతో వ్యాన్‌లో ఆరుుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు  తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం.మృతులంతా కాకుమానువాసులుగా గుర్తించారు. 

Also read:నల్గొండ జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు వద్ద జరిగిన పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  డ్రైవర్ అతి వేగంతో ఈ వాహనాన్ని నడిపారు. వేగంగా నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు చెబుతున్నారు.

Also read:కరీంనగర్‌‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో  వాహనంలో డ్రైవర్ తో పాటు 10 మంది ఉన్నారు. రోడ్డుపై హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడ డ్రైవర్ వాటిని పట్టించుకోలేదని క్షతగాత్రులు చెబుతున్నారు.

వాగులో పడిన సమయంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారు నలుగురి పరిస్థితి కూడ విషమంగా ఉంది.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

ఇటీవల కాలంలో కాలువల్లో కార్లు బోల్తా పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ మాసంలోనే రెండు ఘటనలు వెలుగు చూశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం గత నెల 27వ తేదీన కాకతీయ కాలువలో పడి మృతి చెందారు.

ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఒక్కరు మృతి చెందారు.తాజాగా ఇవాళ నల్గొండ జిల్లాలో మరో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.  ఈ రెండు ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి.ఆదివారం నాడు గుంటూరులో వాగులో వ్యాన్ బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. 

click me!