తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
తిరుపతి: జిల్లాలోని శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గంలోని మిట్టకండ్రిగ వద్ద ఆదివారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.
తిరుపతి వెంకన్నను దర్శించుకొని శ్రీకాళహస్తికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిట్టకండ్రిగ వద్ద ఎదురుగా ఉన్న టీ స్టాల్ కు వెళ్లే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. రాంగ్ రూట్ లో కారు ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులంతా విజయవాడకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఒకరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత వీరంతా విజయవాడ వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీకాశహస్తికి వెళ్లే మార్గంలో వీరు ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు పూర్తిగా దెబ్బతింది.
undefined
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు అతి వేగం, ఇతరత్రా కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుప్రమాదాల నివారణకు పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడ ప్రమాదాలు తగ్గడం లేదు.
కాకినాడ నుండి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో 12 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వైఎస్ఆర్ జిల్లాలో ఈ నెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
also read:ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన ఏపీకి చెందిన వాహనం: ఐదుగురు సురక్షితం, మరో ఆరుగురి కోసం గాలింపు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఈ నెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.మేకల గండి వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
హర్యానాలోని జింద్ జిల్లాలో ఈ నెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. జింద్-భవానీ రహదారిపై బీబీపూర్ గ్రామంలో బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన ఈ ప్రమాదం జరిగింది.