ముద్రగడ వైఎస్ఆర్‌సీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం: ఎంపీ మిథున్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 9, 2023, 12:55 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని  రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డి  చెప్పారు.
 


కాకినాడ: కాపు రిజర్వేషన్ల  ఉద్యమ నేత  ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరుతామనంటే  ఆహ్వానిస్తామని  రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డి  చెప్పారు.కాకినాడలో  ఆదివారంనాడు  మిథున్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి నేత  పార్టీలో  చేరే విషయమై  సీఎం జగన్ స్థాయిలో  నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముద్రగడ పద్మనాభం  వైసీపీలో  చేరుకోవాలని భావిస్తే ఆహ్వానిస్తామని  ఆయన  స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో  ముందు జనసేన చెప్పాలని  మిథున్ రెడ్డి  డిమాండ్  చేశారు.  చంద్రబాబును సీఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడని  మిథున్ రెడ్డి ఆరోపించారు.  కాపు ఎమ్మెల్యేలను  తిడితే వ్యతిరేకత వస్తుందని  కాకినాడ  ఎమ్మెల్యే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని  పవన్ కళ్యాణ్ టార్గె్ చేశారని  ఆయన  చెప్పారు.అభిమానులను రెచ్చగొట్టి   లబ్దిపొందాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని  మిథున్ రెడ్డి  ఆరోపించారు.  

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు  జరిగే అవకాశం లేదని ఆయన  చెప్పారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలకు  తమకు  అధికారాన్ని అప్పగించారని మిథున్ రెడ్డి  చెప్పారు. వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు  ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని  మిథున్ రెడ్డి  స్పష్టం  చేశారు. రాష్ట్రంలో  ముందస్తు ఎన్నికలకు  అవకాశం లేదన్నారు.  ముందస్తు ఎన్నికలు జరుగుతాయని  టీడీపీ, జనసేన చేస్తున్న ప్రచారాన్ని  ఆయన  కొట్టిపారేశారు. తమ పార్టీ క్యాడర్ లో  ఉత్సాహం  నింపేందుకు  ముందస్తు ఎన్నికల అంశాన్ని  
తమ క్యాడర్ ను యాక్టివేట్ చేయడం  కోసం ముందస్తు ఎన్నికలు  అంటూ ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను  సీఎం కాకుండా అడ్డుకుంటామని,  ఉభయ గోదావరి జిల్లాల నుండి వైసీపీకి ఒక్క సీటు కూడ దక్కకుండా  చేస్తామని పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలను కూడ ఆయన  ప్రస్తావించారు.  సీఎం ఎవరు కావాలో, ఎవరు వద్దో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.  పవన్ కళ్యాణో, మరొకరో నిర్ణయిస్తే అది జరగదని ఆయన  అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర  రెండో విడత  ఇవాళ్టి నుండి  ఏలూరు నుండి ప్రారంభం కానుంది.  ఇప్పటికే  మొదటి విడత యాత్ర పూర్తైంది.  వారాహి యాత్రను  పురస్కరించుకొని పవన్ కళ్యాణ్  వైఎస్ఆర్‌సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

 

click me!