టీడీపీ నేత పట్టాబిపై దాడి: ఆరుగురి అరెస్ట్

Published : Feb 12, 2021, 05:16 PM IST
టీడీపీ నేత పట్టాబిపై దాడి: ఆరుగురి అరెస్ట్

సారాంశం

టీడీపీ నేత పట్టాబిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

అమరావతి: టీడీపీ నేత పట్టాబిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ నెల 2వ తేదీన పట్టాబి తన ఇంటి నుండి కార్యాలయానికి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన సమయంలో సీసీటీవీ పుటేజీ దృశ్యాలను ఆధారంగా చేసుకొని పోలీసులు విచారణ నిర్వహించారు.

పట్టాబి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఆరుగురు నిందితులను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు.

పట్టాబిపై దాడి విషయం తెలుసుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు పట్టాబిని పరామర్శించారు. ఈ దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.పట్టాబికి రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పట్టాబిపై దాడిని నిరసిస్తూ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు