వైఎస్ వివేకా హత్య కేసు... ఆదినారాయణకు సిట్ ప్రశ్నలు

By telugu teamFirst Published Dec 12, 2019, 9:42 AM IST
Highlights

హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో గురువారం కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు. 

మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగితే... 8 నెలల తర్వాత మాజీమంత్రిని విచారణకు పిలుస్తున్నారు. హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు. 

Also Read: తమ్ముడు నిరసన, అన్నయ్య ప్రశంసలు: జగన్ నిర్ణయంపై మెగాస్టార్ హర్షం

ఇందులో భాగంగా నేడు ఉదయం ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకానుండటం చర్చనీయాంశమైంది. ఈనెల 5న ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని... తప్పుందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని ఇప్పటికే అదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కేసు విచారణ సిట్​కు చేతకాకుంటే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్​ చేశారు.

Also Read:వైసీపీ సర్కార్ కి జేసీ టైటిల్ ఇదే.....: జగన్ కు సెల్యూట్ చేసిన దివాకర్ రెడ్డి

click me!