ఆ మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలి.. చంద్రబాబు డిమాండ్

Published : Dec 12, 2019, 09:27 AM IST
ఆ మూడు ఛానెళ్లపై నిషేధం ఎత్తివేయాలి.. చంద్రబాబు డిమాండ్

సారాంశం

అసెంబ్లీలోకి రాకుండా ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5పై నిషేధం విధించారని పేర్కొన్నారు. ట్రాయ్‌ ఆదేశాలున్నా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఫైబర్‌‌గ్రిడ్‌కు ఫైన్‌ వేసినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

మీడియా పై ఆంక్షలు ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవస్థల్లో లోపాలను ఎత్తిచూపే మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేసిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కళ్లకు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ వద్ద టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు  మాట్లాడుతూ.. 2430 జీవో తీసుకొచ్చి కేసుల పేరుతో బెదిరిస్తున్నారన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలోకి రాకుండా ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5పై నిషేధం విధించారని పేర్కొన్నారు. ట్రాయ్‌ ఆదేశాలున్నా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఫైబర్‌‌గ్రిడ్‌కు ఫైన్‌ వేసినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

‘జర్నలిస్ట్‌ను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నడిరోడ్డుపై నరికేస్తానంటూ బెదిరించినా చర్యలు తీసుకోలేదు. ఎందుకు కేసు నమోదు చేయలేదు..?. తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్‌ హత్యపై స్థానిక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని హరించినవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలుస్తాం.. అవసరమైతే కోర్టుకెళ్తాం’ అని చంద్రబాబు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మహానాడులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Chandrababu Naidu Powerful speech | Mahanaadu 2026 Day-1
Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu