30 రోజుల్లో సింగపూర్ - అమరావతి మధ్య విమాన సర్వీసులు: బాబు

First Published Jun 7, 2018, 12:33 PM IST
Highlights

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బాబుతో భేటీ

అమరావతి: 30 రోజుల్లో  సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య విమాన సర్వీసులను
ప్రారంభించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో గురువారం నాడు
అమరావతిలో సమావేశమయ్యారు.

సింగపూర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. ఏపీలో
సహజవనరులున్నాయని చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో
రాజధాని నిర్మాణం కోసం  మంచి సిటీని నిర్మిస్తామని హమీ ఇచ్చామన్నారు.ఈ హమీ మేరకే  సింగపూర్ ప్రభుత్వంతో  ఒప్పందం కుదుర్చుకొన్నట్టు ఆయన చెప్పారు.

ప్రపంచంలో సింగపూర్ లో జీవనం సాగించాలని  ప్రజలు కోరుకొంటారని బాబు చెప్పారు.  
సింగపూర్ లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలుంటాయని బాబు చెప్పారు. క్రమశిక్షణ కూడ  అదే రకంగా ఉంటుందన్నారు.  

తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్
ఇవ్వాలని తాను కోరగానే సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చిన విషయాన్ని బాబు
గుర్తు చేశారు.

2020 నాటికి అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం పూర్తి కానున్నాయని
చంద్రబబాబునాయడు చెప్పారు.  సింగపూర్ నుండి నేరుగా  అమరావతికి నేరుగా
విమానసర్వీసులు నడిపేందుకు చర్చించినట్టు బాబు చెప్పారు. ఈ మేరకు అవగాహన
కుదిరిన విషయాన్ని ఆయన చెప్పారు. 30 రోజుల్లో విమాన సర్వీసులు
ప్రారంభించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.  

ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా సింగపూర్
ప్రభుత్వానికి 58 శాతం వాటా, ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉందని బాబు చెప్పారు. 

click me!