(వీడియో) 20 తర్వాత నంద్యాల షెడ్యూల్

Published : Jul 15, 2017, 07:13 AM ISTUpdated : Mar 24, 2018, 12:13 PM IST
(వీడియో) 20 తర్వాత నంద్యాల షెడ్యూల్

సారాంశం

రాష్ట్రం మొత్తం నంద్యాల వైపే చూస్తోంది. చంద్రబాబు ఎప్పుడైతే నంద్యాలను ప్రిస్టేజ్ గా తీసుకున్నారో, గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారో నియోజకవర్గం మొత్తం మీద ఒకలాంటి ఉద్రిక్తత మొదలైంది.

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ ఈనెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా సరే వెలువుడే అవకాశం ఉంది. అలాగని వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిి చెబుతున్నారు. నంద్యాల ఉపఎన్నికంటే అదేదో చంద్రబాబునాయుడు-వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ అయిపోయింది. నిజానికి బరిలో ఉన్నది భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డే అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆస్ధాయిలో ఉంది. అందుకే ఇపుడు రాష్ట్రం మొత్తం నంద్యాల వైపే చూస్తోంది.

చంద్రబాబు ఎప్పుడైతే నంద్యాలను ప్రిస్టేజ్ గా తీసుకున్నారో, గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారో నియోజకవర్గం మొత్తం మీద ఒకలాంటి ఉద్రిక్తత మొదలైంది.టిడిపి అభ్యర్ధి భూమా చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి మాత్రం శుక్రవారం నంద్యాల మండలంలోని కొత్తపల్లి గ్రామం నుండి ప్రచారం ప్రారంభించారు. వైసీపీ ఎంఎల్ఏ గౌరు చరితరెడ్డి, రాజగోపాలరెడ్డి వంటి నేతలు వెంటున్నారు. ఉపఎన్నికల్లో వైసీపీని గెలిపించాల్సిన అవసరాన్ని శిల్పా ఓటర్లకు చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu