
విజయదశమి నుంచి రాజధాని అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.
అమరావతి నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రైడ్’, పోలవరం నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్’ గా విలసిల్లుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
అమరావతి, పోలవరం నిర్మాణాలు అంతిమంగా సౌభాగ్యం, సంతోషాలకు సూచికలని ఆయన వర్ణించారు.
అమరావతి పాలనా నగర ఆకృతులపై ఫోస్టర్స్ బృందంతో వెలగ పూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే నిర్మాణపు ముహూర్తం నిర్ణయించారు.
ఆగస్టు 15 కల్లా పాలనా నగర డిజైన్లు సంపూర్ణంగా అందించాలని ఫోస్టర్స్ బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.
ఫోస్టర్స్ అందించే తుది ఆకృతులపై కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతికి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఫోస్టర్స్ వారు ఆగస్టు 15 కల్లా అసెంబ్లీ డిజైన్లు అందించాక హఫీజ్ కాంట్రాక్టర్స్ వారు స్ట్రక్చరల్ డిజైన్ అందజేస్తారు. సెప్టెంబర్ లో టెండర్లు పిలిచి విజయదశమికి పనులు ప్రారంభిస్తారు.
అలాగే హైకోర్టు ఆకృతులు ఆగస్ట్ 30 నాటికి అందజేస్తారు. సెప్టెంబర్ 15 నాటికి స్ట్రక్చరల్ డిజైన్స్ అందజేస్తారు. డిజైన్లు అందిన నెల రోజులల లోపల సీఆర్డీఏ టెండర్లు పిలవడం పూర్తి చేస్తుంది. ఏడాదిన్నరలో సీఆర్డీఏ మంచి రాజధాని పూర్తవుతుంది. ఫోస్టర్స్ వారు హైకోర్టు ఆకృతులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు సభ్యుల బృందానికి చూపించారని, వారి సూచనలమేరకు ఆకృతుల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.