ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. సీఐడీ విచారణ వేగవంతం, నోయిడాలో సీమెన్స్ డైరెక్టర్ భాస్కర్ అరెస్ట్

Siva Kodati |  
Published : Mar 08, 2023, 08:53 PM IST
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. సీఐడీ విచారణ వేగవంతం, నోయిడాలో సీమెన్స్ డైరెక్టర్ భాస్కర్ అరెస్ట్

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ భాస్కర్‌ను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సీఐడీ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా సీమెన్స్ కంపెనీ డైరెక్టర్ భాస్కర్‌ను బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా..చంద్రబాబు నాయడు సీఎంగా ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 242 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌, మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావును అరెస్ట్ చేసింది ఈడీ. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్