
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం జగ్గిసెట్టిగూడెంలో shepherd ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మేకలకాపరిని హత్య చేసిన తలను దుండగులు తీసుకెళ్లారు. మృతుడి తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో మేకల కాపరిని దుండగులు హత్య చేశారు. హత్యకు గురైన మేకల కాపరిని parvathaluగా గుర్తించారు.
అయితే పర్వతాలును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్వతాలుకు ఇతరులతో ఏమైనా గొడవలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పర్వతాలు కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పర్వతాలు తలను నిందితులు ఎక్కడ వదిలి వెళ్లారనే విషయమై పోలీసులు గాలిస్తున్నారు.