చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో రైతు మృతి..

Published : Mar 31, 2022, 09:22 AM ISTUpdated : Mar 31, 2022, 10:21 AM IST
చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో రైతు మృతి..

సారాంశం

చిత్తూరు జిల్లాలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన  ఓ రైతు మృతిచెందాడు.

చిత్తూరు జిల్లాలో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన  ఓ రైతు మృతిచెందాడు. జిల్లాలోని సదుం జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. పంట పోలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో రైతు ఎల్లప్ప అనే రైతు కాపలా కోసం పొలానికి వెళ్లారు.  పంట పొలాల్లో నిద్రిస్తున్న రైతు ఎల్లప్పపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో ఎల్లప్ప తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఎల్లప్ప మృతిచెందాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు కొద్దిరోజులుగా తిరుమలలో ఏనుగుల మంద కలకలం సృష్టిస్తుంది. తిరుమల పాపవినాశనం రహదారి వెంటక ఏనుగులు సంచరిస్తున్నాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం దారిలో తిష్ట వేశాయి. ఆకాశగంగ ప్రాంతంలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగుల మంద.. వాహనదారులను వెంబడించింది. ఏనుగుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులకు అడవిలోకి తిరిగి పంపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులు తిరుమల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం