అవినీతి ఆరోపణలు: తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై సస్పెన్షన్ వేటు

Published : Mar 31, 2022, 09:32 AM ISTUpdated : Mar 31, 2022, 09:35 AM IST
అవినీతి ఆరోపణలు: తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావుపై సస్పెన్షన్ వేటు

సారాంశం

తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సీఎస్పీరావును కేంద్ర విద్యాశాఖ సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసింది. రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా Tadepalligudemలోని NIT డైరెక్టర్  ప్రొఫెసర్ CSP Rao ను కేంద్ర విద్యా శాఖ సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్పీరావుపై  CBI అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆయన ఇంటిలో searches చేస్తున్నారు.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు సూర్యప్రకాష్ రావుపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కూడా ఆయన ఇళ్లపై సోదాలు చేశారు.ఏపీ, తెలంగాణ,తమిళనాడు  రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సీఎస్పీ రావుకు చెందిన ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లపై కూడా సీబీఐ సోదాలు చేసింది.   ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను సీబీఐ అధికారుల స్వాధీనం చేసుకొన్నారు.ఏపీకి చెందిన ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ ప్రోవైడర్ ఎస్ఎస్ కేటరర్స్ నుండి సూర్యప్రకాష్ రావు లబ్ది పొందారని సీబీఐ అధికారులు తెలిపారు.  

సూర్య ప్రకాష్ రావుతో పాటు ధనలక్ష్మి, నేరేళ్ల సుబ్రమణ్యం, ఎన్ విష్ణుమూర్తి,. విద్యానికేతన్ లపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. 
అంతేకాదు నిట్ లో కీలకమైన  స్థానాల్లో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా సీఎస్పీ రావు నిబంధలను ఉల్లంఘించారని సీబీఐ  కేసు నమోదు చేసింది.  నిట్ లో పీఆర్ఓ పోస్టు లేకున్నా కూడా సీఎస్పీ రావు రామ్ ప్రసాద్ అనే వ్యక్తిని పీఆర్‌ఓ గా నియమించారు. నెలకు రామ్ ప్రసాద్ కు రూ. 50 వేల వేతనం ఇచ్చారని సీబీఐ తెలిపింది. రామ్ ప్రసాద్ 2018 డిసెంబర్ 3 నుండి 2019 నవంబర్ 1 వ తేదీ వరకు పీఆర్ఓగా పనిచేశారు. 

నిట్ లో అర్హత లేనివారికి కూడా సీఎస్పీ రావు ఉద్యోగాలు కట్టబెట్టారని సీబీఐ గుర్తించింది. అంతేకాదు అనుమతులు లేకున్నా కూడా అభ్యర్ధులకు ఉద్యోగాలు ఇచ్చారని కూడా సీబీఐ తెలిపింది. ఈ ఆరోపణలతో ఆయనను సస్పెండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu