బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవమానం.. రోజ్‌గార్ మేళా కార్యక్రమంలోకి అనుమతించని సీఐఎస్ఎఫ్ సిబ్బంది

By team teluguFirst Published Nov 23, 2022, 11:46 AM IST
Highlights

విశాఖపట్నంలోని ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో నిర్వహించిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలోకి పాల్గొనేందుకు వెెళ్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును గేటు వద్ద సీఐఎస్ ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి చెప్పడంతో లోపలికి అనుమతించారు. 

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవమానం జరిగింది. విశాఖపట్నంలోని ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో మంగళవారం జరిగిన పీఎం రోజ్‌గార్ మేళాలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో సోము వీర్రాజు గేటు దగ్గరే నిలిచిపోవాల్సి వచ్చిందని ‘డెక్కన్ క్రానికల్’ కథనం పేర్కొంది.

ఫోర్న్ వీడియోలు చూడడానికి అలవాటు పడి.. అమ్మాయిల బాత్రూంలో దూరి.. వీడియోలు తీసి...

వర్చువల్ మోడ్‌లో ప్రధాని మోడీ ప్రారంభించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమం మంగళవారం ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మంత్రితో పాటు సోము వీర్రాజు కూడా ఫంక్షన్‌ హాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ  సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.

సీఈసీగా ఉత్తమైన వ్యక్తి ఉండాలి.. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి అవసరం: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

దీంతో సోము వీర్రాజుకు కోపం వచ్చింది. గార్డులపై అరిచాడు. ఈ విషయం కిషన్ రెడ్డికి తెలియడంతో ఆయన గేటు వద్దకు చేరుకున్నారు. వీర్రాజును లోపలికి అనుమతించాలని గార్డులకు సూచించడంతో పరిస్థితి చల్లబడింది. అయితే ఆయన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడని గార్డులకు తెలియదని సీనియర్ సీఐఎస్‌ఎఫ్ అధికారులు తర్వాత వీర్రాజుకు చెప్పారు.

జగన్ కు ఉచిత సలహాలొద్దు... గౌరవాన్ని కాపాడుకొండి : తండ్రికి వసంత కృష్ణప్రసాద్ చురకలు

కాగా.. రోజ్ గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. ఈసందర్భంగా మోడీ ప్రధాన మంత్రి మిషన్ కర్మయోగి ప్రారంభం మాడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. ప్రధాని ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 200 మందికి సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 

click me!