గంజాయి మత్తులో విద్యార్ధులు: విజయవాడ పోలీసుల విచారణలో సంచలన విషయాలు

By narsimha lodeFirst Published Nov 20, 2020, 5:32 PM IST
Highlights

 గంజాయి మత్తులో విజయవాడ విద్యార్ధులు జోగుతున్నారని  పోలీసుల దర్యాప్తులో తేలింది.విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి.


విజయవాడ: గంజాయి మత్తులో విజయవాడ విద్యార్ధులు జోగుతున్నారని  పోలీసుల దర్యాప్తులో తేలింది.విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి.

గంజాయికి బానిసలుగా  టెన్త్, బిటెక్ విద్యార్థులు మారినట్టుగా  పోలీసులు గుర్తించారు. రెండు రోజుల్లో 55 మందిని అదుపులోకి తీసుకొన్నారు. 12 మంది బిటెక్, 20 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులను పోలీసులు విచారించారు.

విజయవాడకు చెందిన పలు కాలేజీలకు చెందిన విద్యార్ధులు గంజాయికి అలవాటు పడినట్టుగా గుర్తించారు. పేపర్ సిగరెట్ ద్వారా విద్యార్ధులు గంజాయి తాగుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.

గంజాయికి అలవాటు పడిన విద్యార్ధులను డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు పోలీసులు. విద్యార్ధులపై నిఘా పెట్టాలని కూడ పోలీసులు ఆయా కాలేజీలకు లేఖ రాశారు. ఏపీ రాష్ట్రంలో ఇటీవల కాలంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాల నుండి విజయవాడలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

అంతేకాదు గంజాయిని  కూడా కాలేజీల్లో సరఫరా చేస్తున్నవారిని గుర్తించారు. కాలేజీ యాజమాన్యాలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరారు. 

click me!