అబ్దుల్ సలాం బంధువులకు సీఎం జగన్ పరామర్శ

By narsimha lodeFirst Published Nov 20, 2020, 4:53 PM IST
Highlights

నంద్యాలలోని అబ్దుల్ సలాం  అత్త, ఇతర బంధువులు శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.


కర్నూల్:  నంద్యాలలోని అబ్దుల్ సలాం  అత్త, ఇతర బంధువులు శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు.

నంద్యాల సీఐ సోమేశేఖర్ రెడ్డి వేధింపులతో ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియో రికార్డు చేసి అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

నంద్యాలలో ఇటీవల కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ సలాం అత్తగారు మాబున్నీసా, ఆమె కొడుకు శంషావలి, కూతురు సాజీదా లను తిరుగు ప్రయాణంలో ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. pic.twitter.com/U9EJXb1Hhk

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ ఘటనపై  ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార పార్టీపై టీడీపీ విమర్శలు గుప్పించింది.ఇవాళ కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను  అబ్దుల్ సలాం బంధువులు కలిశారు.

also read:అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త

సలాం అత్త మాబున్నీసా బేగం, ఆమె కూతురు సాజీదా, కొడుకు శంషావళిలు ఇవాళ సీఎంను కలిశారు. సలాం మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎంను వారు కోరారు.

also read:సీఎంను అరెస్టు చేస్తారా: సలాం ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

ఈ ఘటనకు సంబంధించి జగన్ కు వివరించారు. పోలీసులు  ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో వారంతా వివరించారు.నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.  మరోవైపు  తన కూతురు సాజీదాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మాబున్నీసా బేగం జగన్ ను కోరారు. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు.
 

click me!