నిమ్మగడ్డపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

Published : Nov 20, 2020, 04:08 PM IST
నిమ్మగడ్డపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

సారాంశం

తాను రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నానని.. తనను ఎవరూ ఏమీ అనకూడదని నిమ్మగడ్డ అంటున్నారని.. ఆయన అలా మాట్లాడటే దిక్కుమాలినతనమని కొడాలని నాని పేర్కొన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ  రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారా..? టీడీపీలో సభ్యుడిగా ఉన్నారో అర్థం కావడం లేదని.. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అంటూ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గురువారం కొడాలి నాని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద  విలేకరులతో మాట్లాడారు.

తాను రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నానని.. తనను ఎవరూ ఏమీ అనకూడదని నిమ్మగడ్డ అంటున్నారని.. ఆయన అలా మాట్లాడటే దిక్కుమాలినతనమని కొడాలని నాని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థగా ఎన్నికల కమిషన్ పై తమకు గౌరవం ఉందని అన్నారు. కానీ నిమ్మగడ్డ మాత్రం చంద్రబాబు చెబితే స్థానిక ఎన్నికలను ఆపేశారని గుర్తు చేశారు.

తనకు ప్రభుత్వంతో హాని ఉందని.. తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ తమ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ అవమానిస్తున్నారని నాని మండిపడ్డారు. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కిమిషనర్ పదవికి రాజీనామా చేసినా.. లేదా ఆయనను ఆ పదవి నుంచి తొలగించినా.. రాజ్యాంగ వ్యవస్థకు గౌరవం పెరుగుతుందని కొడాలి నాని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu