గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 20 మందికి గాయాలు..

Published : Jun 05, 2023, 02:35 PM ISTUpdated : Jun 05, 2023, 03:06 PM IST
గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు దుర్మరణం.. 20 మందికి గాయాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు దుర్మరణం చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. వివరాలు.. ప్రతిపాడు మండలం కొండపాడుకు చెందిన పలువురు ట్రాక్టర్‌లో చేబ్రోలు మండలం జూపుడికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. అయితే ట్రాక్టర్ అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గుర అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో గాయపడినవారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

అయితే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో మరొకరి పరిస్థితి విషమంగా  ఉంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఎవ్వడిని వదలను | YS Jagan Reaction On MP Midhun Reddy Issue | Asianet Telugu
YS Jagan On Vangaveeti Radha | వంగవీటి రాధా జనసేనలో చేరడంపై జగన్ కామెంట్స్