విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణలో ఏడో తరగతి విద్యార్థి జశ్వంత్ మరణించాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్ధుల మధ్య ఘర్షణలో ఏడో తరగతి విద్యార్ధి జశ్వంత్ మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.విశాఖపట్టణంలోని ప్రైవేట్ స్కూల్‌లో ఒకే క్లాస్ కు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. జశ్వంత్ అతని స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. స్నేహితులు జశ్వంత్ పై దాడి చేశారు. ప్రమాదవశాత్తు గొంతుపై జశ్వంత్ పై దాడికి దిగారు. దీంతో జశ్వంత్ అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే తోటి విద్యార్థులు సమీపంలోనే ఉన్న టీచర్ కు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకొన్న టీచర్ స్కూల్ కు చేరుకొన్నాడు. అప్పటికే జశ్వంత్ నోటి నుండి నురగలు కక్కుతూ ఉండడాన్ని గమనించాడు. వెంటనే జశ్వంత్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జశ్వంత్ మరణించాడు.
విద్యార్థుల మధ్య ఘర్షణే జశ్వంత్ మృతికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. జశ్వంత్ మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై జశ్వంత్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.