పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు: నాలుగు మృతదేహాల వెలికితీత

By narsimha lodeFirst Published Dec 17, 2020, 6:04 PM IST
Highlights

జిల్లాలోని సిద్దవటంలో పెన్నానదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు గల్లంతయ్యారు.  గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

డప: జిల్లాలోని సిద్దవటంలో పెన్నానదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు గల్లంతయ్యారు.  గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్ వర్ధంతి కార్యక్రమం గురువారం నాడు జరిగింది. ఏడుగురిలో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. వారిలో ఇద్దరు అన్నదమ్ములున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. చీకటి పడడంతో సహయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది.

తిరుపతిలోని కోర్లకుంటకు చెందిన 10 మంది వెంకటశివ స్నేహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అనంతరం వెంకటశివతో కలిసి 11 మంది పెన్నా నదిలో స్నానానికి దిగారు.

నదిలో వీరంతా ఒక్కసారిగా మునిగిపోయారు. అతి కష్టం మీద వెంకటశివ నది నుండి బయటకు వచ్చారు. మిగిలిన ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో సోమశేఖర్, యశ్వంత్, తరుణ్, జగదీష్, రాజేష్, సతీష్ , షన్ను ఉన్నారు.

గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నది లోతును అంచనా వేయడంలో పొరపాటు పడడంతో మునిగిపోయినట్టుగా అనుమానిస్తున్నారు.ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గల్లంతైన వారి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.   గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 

click me!