కందుకూరులో తొక్కిసలాట: శేషశయనా రెడ్డి కమిషన్ ముందు హజరైన టీడీపీ నేతలు

By narsimha lodeFirst Published Feb 7, 2023, 12:47 PM IST
Highlights

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని  కందుకూరులో తొక్కిసలాటపై  శేషసాయి రెడ్డి కమిషన్  ఇవాళ విజయవాడలో  విచారణను ప్రారంభించింది.  
 

విజయవాడ: ఉమ్మడి   ప్రకాశం జిల్లాలోని  కందుకూరులో  తొక్కిసలాట ఘటనపై  ప్రభుత్వం నియమించిన శేషశయనా రెడ్డి  కమిషన్  మంగళవారం నాడు విచారణ నిర్వహిస్తుంది.  కందుకూరులో  తొక్కిసలాట ఘటనపై   విజయవాడలోని స్టేట్ గెస్ట్  హౌస్ లో  శేషశయనా రెడ్డి కమిషన్ విచారణ  చేస్తుంది. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి  చెందిన  టీడీపీ నేతలు  ఇంటూరి రాజేష్, నాగేశ్వరరావులు  ఇవాళ  శేషశయనా రెడ్డి  కమిషన్ ముందు హజరయ్యారు.  

2022 డిసెంబర్  28వ తేదీన   కందుకూరులో  జరిగిన తొక్కిసలాటలో  ఎనిమిది మంది మృతి చెందారు.  ఈ ఏడాది జనవరి  1వ తేదీన గుంటూరులో  జరిగిన తొక్కిసలాటలో  ముగ్గురు మహిళలు మృతి చెందారు.  ఈ రెండు కార్యక్రమాల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

 గుంటూరులో  ఉయ్యూర్ పౌండేషన్  నిర్వహించిన  కార్యక్రమంలో  చంద్రన్న  సంక్రాంతి కిట్స్  కోసం  మహిళలు ఒక్కసారిగా తోసుకు రావడంతో  తొక్కిసలాట చోటు  చేసుకుంది.  ఈ ఘటనలో  ముగ్గురు మహిళలు మృతి చెందారు.   ఈ రెండు ఘటనలపై విచారణ కోసం  రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్  జడ్జి  శేషశయనా రెడ్డి కమిషన్ ను ఏర్పాటు  చేసింది. 

also read:గుంటూరు తొక్కిసలాట: విచారణ ప్రారంభించిన రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి కమిషన్

గుంటూరులో  జరిగిన తొక్కిసలాటపై  గత నెల  19వ తేదీన  శేషశయన రెడ్డి   కమిషన్ విచారణ నిర్వహించింది.  తొక్కిసలాట జరిగిన  గ్రౌండ్ తో  పాటు   జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో  మాట్లాడి వివరాలు సేకరించింది.  ఈ విషయమై  నిర్వాహకులను కూడా  కమిషన్ ప్రశ్నించింది.. ఇవాళ  కందుకూరు ఘటనపై   శేషశయనా రెడ్డి  కమిషన్ విచారణను ప్రారంభించింది.  చంద్రబాబు రోడ్ షోలో  తొక్కిసలాటకు  దారితీసిన పరిస్థితులపై   కమిషన్ విచారిస్తుంది.

ఈ రెండు ఘటనలపై   విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి   నివేదికను  ఇవ్వనుంది కమిషన్. మరో పది రోజుల్లో  ఈ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది.ఈ రెండు తొక్కిసలాటలను దృష్టిలో ఉంచుకొని  జీవో నెంబర్  1ని ప్రభుత్వం తీసుకు వచ్చింది.  జీవో నెంబర్ 1పై సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై  ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.  ఈ  విషయమై  టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇంప్లీడయ్యాయి. ఈ విషయమై  విచారణ నిర్వహించిన  హైకోర్టు తీర్పును రిజర్వ్  చేసింది.
 

click me!