కరోనా కలకలం: న్యూఢిల్లీ ఏపీ భవన్‌‌లో అధికారికి కరోనా, ఆఫీసుల మూసివేత

By narsimha lode  |  First Published Jun 7, 2020, 6:17 PM IST

న్యూఢిల్లీలో ఆంధ్రా భవన్ లో సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలను మూసివేశారు. రెండు రోజుల తర్వాతే ఈ కార్యాలయాలను ఓపెన్ చేయనున్నారు.


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఆంధ్రా భవన్ లో సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలను మూసివేశారు. రెండు రోజుల తర్వాతే ఈ కార్యాలయాలను ఓపెన్ చేయనున్నారు.

కరోనా సోకిన అధికారిని ఆంధ్రా భవన్ అధికారిని ఆదివారం నాడు ఉదయం ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సీనియర్ అధికారితో సీఎంఓ కు చెందిన ఓ అధికారి ఇటీవల కాలంలో సన్నిహితంగా ఉన్నాడని సమాచారం. ఢిల్లీలోని ఓ జర్నలిస్టుకు కరోనా సోకింది. దీంతో మీడియా సెంటర్ ను సీల్ చేశారు అధికారులు.

Latest Videos

undefined

also read:ఏపీపై కరోనా పంజా: మొత్తం కేసులు 4659కి చేరిక

రెండు రోజుల పాటు మీడియా సెంటర్ కు రావొద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆంధ్రాభవన్ లో ఉద్యోగికి కరోనా సోకడంతో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

డిల్లీ రాష్ట్రంలో కరోనా కేసులు 27 వేలకు పైగా దాటాయి. ఢిల్లీ సరిహద్దులను జూన్ 8వ తేదీ నుండి ఓపెన్ చేయాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. లాక్ డౌన్ ఆంక్షలపై కేంద్రం సడలింపులు ఇవ్వనుంది. రేపటి నుండి మరిన్ని రంగాల్లో ఆంక్షలకు సడలింపులు ఇవ్వనుంది కేంద్రం.
 

click me!