చంద్రబాబుకు ఐదంచెల భద్రత

Published : Jan 21, 2017, 11:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
చంద్రబాబుకు ఐదంచెల భద్రత

సారాంశం

మావోయిస్టుల నుండి పొంచి ఉన్న ముప్పు కారణంగా చంద్రబాబు భద్రతను ఐదంచెల పెంచారు

చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుండి ముప్పు ఎక్కువైనట్లే ఉంది. ఎప్పటి నుండో చంద్రబాబు మావోయిస్టుల టార్గెట్ లో ఉన్నారు. ఒకసారి మరణం అంచులదాకా వెళ్ళి అదృష్టం కొద్దీ తప్పించుకున్నారు. దాంతో అప్పటి నుండి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు భద్రతను ఏర్పాటు చేసారు. మూడంచెల ఎస్పీజి భద్రత చంద్రబాబుకు 24 గంటలూ కాపలా ఉంటుంది.

 

ఇటీవలే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో మూడంచెల భద్రతను ఐదంచెలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీలోని ఏపి భవన్ వద్ద మావోయిస్టులు పలుమార్లు రెక్కీ నిర్వహించారని బయటపడింది. దాంతో చంద్రబాబుకు భద్రతను మరింత పెంచాలని తాజాగా కేంద్రం నిర్ణయించింది. దావోస్ నుండి తిరిగిరాగానే భద్రత పెరగుతుంది.

PREV
click me!

Recommended Stories

శ్రీ సిటీలో బాయిలర్ పేలుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ట్యాబ్లెట్ ఇండియా క్లారిటీ
చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu