ఇద్దరూ అపవిత్రులేనా ?

Published : Jan 21, 2017, 09:39 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఇద్దరూ అపవిత్రులేనా ?

సారాంశం

పార్టీల పోటాపోటీ చర్యలు చూసిన జనాలు మాత్రం మొత్తానికి ఇద్దరు నేతలూ అపవిత్రులేనని  తేలిందని జోకులేసుకుంటున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో శుద్ధి రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసీపీలు పోటా పోటీగా రోడ్లను ఆవు పంచకం, పశుపు నీళ్ళతో శుద్ధి చేస్తున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే, జగన్ పర్యటన ద్వారా రాజధాని ప్రాంతం అపవిత్రమైందని టిడిపి నేతలు భావించారు. దాంతో టిడిపి శ్రేణులు జగన్ తిరిగిన రాజధాని ప్రాంతంలో పశుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసారు.

 

దాన్ని గమనించిన వైసీపీ శ్రేణులు ఊరకుంటాయా? వెంటనే వారు కూడా చంద్రబాబునాయుడు రోజు తిరిగే రహదారిపై గోపంచకం, పశుపు నీళ్లు బిందెలతో చల్లి శుద్ధి చేసారు. జగన్ తిరిగాడని టిడిపి వాళ్ళు, చంద్రబాబు తిరిగే రహదారులను శుద్ధిపేరుత్ వైసీపీ శ్రేణులు పశుపు నీళ్ళు చల్లటం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. పార్టీల పోటాపోటీ చర్యలు చూసిన జనాలు మాత్రం మొత్తానికి ఇద్దరు నేతలూ అపవిత్రులేనని  తేలిందని జోకులేసుకుంటున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?