నాలుగో రోజుకు చేరిన ప్రవీణ్ ‘ఉక్కు’ ఆమరణ దీక్ష

First Published Jan 21, 2017, 9:37 AM IST
Highlights

ప్రపంచమంతా తిరిగే చంద్రబాబు ఇంటెనక ఉండే ఉక్కు సమస్య పరిష్కరించలేకపోతున్నాడు: మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

 

స్టీల్‌ ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు నాలుగో రోజుకు చేరుకుంది. ఆరోగ్యం సన్నగిల్లడం మొదలయినా దీక్ష విరమించేది లేదని శనివారం నాడు ప్రవీణ్ ప్రకటించారు. ఆయనకు అన్నివైపుల నుంచి మద్ధతు లభిస్తూ ఉంది.పక్కనున్న అనంతపురం జిల్లాలో అనేక చోట్ల యువకులు,జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రదర్శనలునిర్వహించారు. శిబిరం పరిసరాలలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.

 

ఇక ప్రొద్దటూరులో విద్యార్థులు వివిధ ప్రజాసంఘాలు బైపాస్ రోడ్డు మీద రాస్తా రోకో నిర్వహించారు.

 

ఈ రోజు ఉదయం జమ్మల మడుగు అర్డీవో కూడా వచ్చి, దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే,  ప్రభుత్వం నుంచి అధికారిక హామీ వచ్చే దాకా విరమించుకునే ప్రసక్తి లేదని ప్రవీణ్ తెలిపారు.

 

పోతే, మాజీ ఎంపి డాక్టర్ ఎం వి మైసూరా రెడ్డి, మైదుకూర్ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి ఈరోజు దీక్షా శిబిరానికి వచ్చి మద్ధతు తెలిపారు.

 

చిన్న  వయసులోనే ప్రవీణ్ కుమార్ పెద్ద ఉద్యమం చేపట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అశ్రద్ద చేయకుండా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని సూచించారు. స్టీల్ ప్లాంట్  రాయలసీమ మొత్తానికి సంబంధించి డిమాండ్ అని ఆయన అన్నారు.

స్టీల్ ప్లాంట్ పట్ల ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడి వైఖరని మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి ఖండించారు.

 

“ ఆయన ప్రపంచమంతా తిరుగుతున్నారు. పెట్టుబడులు తెస్తున్నాంటున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. తీరా చూస్తూ ఇంటెనక ఉన్న సమస్కను పరిష్కరించడం లేదు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ను విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేందుకు ప్రవీణ్ దీక్ష సూచన. ముఖ్యమంత్రి విస్మరించరాదు,” అని అన్నారు.

 

పొద్దుటూరు ఊరంతా ఇపుడు ఉక్కు ఉద్యమంలో ఉంటే స్థానిక ఎమ్మెల్యే  ఆర్ చంద్రశేఖర్ రెడ్డి గాని,  మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి గాని దీక్ష శిబిరం పరిసరాల్లోకి రాకపోవడం బాగా విమర్శలకు తావిస్తున్నది.

ఎమ్మెల్సీ గేయానంద్ కూడా ప్రవీణ్ ను పరామర్శించి ఆయన దీక్షకు మద్దతు తెలిపారు.కేంద్ర నిఘా సంస్థల ప్రతినిధులకూడా  ఉక్కు ఉద్యమం గురించి ప్రొద్దటూరు వాకబు చేశారు. దీనికోసం ఐబి కొంతమంది అధికారులను పంపి సమాచారం సేకరించారు.

 

ఈ నాలుగు రోజులుగా ఒక ఎమ్మార్పీఎస్‌ నాయకులకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి దీక్షాశిబిరంలో కూర్చున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మురళీకృష్ణమనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇంతమొండి వైఖరిపనికిరాదని అన్నారు. నన్నిటి రిలే నిరాహార దీక్షలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు మబ్బు గుర్రప్ప, సుబ్బు, కత్తి గుర్రయ్య, ఇల్లూరు గురుశంకర్, గజ్జల బాలన్న, గౌడ సంఘం నాయకులు శ్రీను గౌడ్, రామయ్య గౌడ్, పీడీఎస్‌యూ నాయకులు రమేష్, బాల, మాలమహానాడు నాయకులు ఐజయ్య, పీరా తదితరులు ఉన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ సాధనా సమితి నాయకులు అమరనాథరెడ్డి, ఖలందర్‌ తదితరులు  పాల్గొన్నారు.

 

click me!