మచిలీపట్నంలో రెండోసారి వ్యాక్సిన్ డ్రై రన్... (వీడియో)

By AN TeluguFirst Published Jan 2, 2021, 12:07 PM IST
Highlights

కృష్ణాజిల్లా, మచిలీపట్నం లో మూడు ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమయ్యింది.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన డ్రై రన్ లో డిఎంహెచ్ ఓ సుహాసిని, ఆర్డీవో ఖాజావలి పాల్గొన్నారు.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం లో మూడు ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమయ్యింది.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన డ్రై రన్ లో డిఎంహెచ్ ఓ సుహాసిని, ఆర్డీవో ఖాజావలి పాల్గొన్నారు.

"

వ్యాక్సిన్ ను అందించడంలో సాంకేతిక లోపాలను సరిచేసి చూసుకోవడం కోసం రెండవసారి డ్రై రన్ నిర్వహిస్తున్నట్లుగా  కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో ముందుగా నమోదు కాబడిన పేర్లను మహిళ కానిస్టేబుల్, సచివాలయ సిబ్బంది తనిఖీ చేసి,డిజిటల్ సిబ్బంది వద్దకు వెళ్లిన తదుపరి పేరును పరిశీలించి, వ్యాక్సిను అందించే ప్రదేశానికి పంపిస్తారని డిఎంహెచ్ ఓ తెలిపారు. 

వ్యాక్సిన్ వేసిన తర్వాత 30 నిమిషాల పాటు వైటింగ్ రూమ్ లో అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత పంపిస్తామని ఒకవేళ ఏదైన రియాక్షన్ ఇస్తే మోతాదును బట్టి తిరిగి వైద్యం అందిస్తామని తెలిపారు. అనంతరం వ్యాక్సిన్ కు ఉపయోగించిన నిడిల్స్ ను నిర్వీర్యం చేస్తామని తెలిపారు

మచిలీపట్నం ఆర్డీవో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్ లో అత్యుత్తమ వ్యాక్సిన్ ను ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసి ముందుగా ఎన్నిక కాబడిన వారియర్స్ కు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ఈ రోజు డిఎంహెచ్ఓ అధికారిణి తో కలిసి పరిశీలించానని తెలిపారు
 

click me!