ఏపీలో రెండో విడత వ్యాక్సినేషన్ షురూ... ఈసారి ఆ శాఖల ఉద్యోగులకే

By Arun Kumar PFirst Published Feb 3, 2021, 9:30 AM IST
Highlights

రెండో విడతలో కరోనా వ్యాక్సిన్ కోసం 5 లక్షల 90 వేల మంది నమోదు చేసుకోవడంతో వారందరికీ ఇచ్చేలా 3 వేల 181 సెషన్ సైట్​లను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

అమరావతి: నేటి(బుధవారం) నుంచి రెండో విడత కరోనా టీకాల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్దమైంది. ఇప్పటికే మొదటివిడతలో వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయగా రెండో విడతలో పంచాయతీ రాజ్, పురపాలక, రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఈ విడతలో వ్యాక్సిన్ కోసం 5 లక్షల 90 వేల మంది నమోదు చేసుకోవడంతో వారందరికీ ఇచ్చేలా 3 వేల 181 సెషన్ సైట్​లను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

 మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 88 వేల 307 మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా...ఇప్పటి వరకు లక్షా 8 వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. మరో 2 లక్షల మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. 

 read more కరోనా వ్యాక్సిన్ : యువడాక్టర్ కు తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు..

 తొలి విడత వ్యాక్సినేషన్ అనంతరం అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యారోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే విషయాన్ని వివిధ శాఖల్లోని ఉద్యోగులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మొదటి విడతలో కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా 79 దుష్ప్రభావ ఘటనలు చోటుచేసుకోగా రెండో విడతలో అలాంటివి చోటుచేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. 

click me!