అనుమానం... భార్య గొంతుకోసి చంపేశాడు..!

Published : Feb 03, 2021, 08:50 AM IST
అనుమానం... భార్య గొంతుకోసి చంపేశాడు..!

సారాంశం

అందరూ ఆడపిల్లల్నే క న్నావంటూ భార్యతో సూరిబాబు గొడవపడేవాడు. దీనికి తోడు భార్యను అనుమానించి వేధించేవాడు. ఐదునెలల క్రి తం భార్యాబిడ్డలను వదిలిపెట్టి  నివాసాన్ని శ్రీకాళహస్తికి  మార్చేశాడు. 

అనుమానంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కేవీబీపురంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేవీబీపురం బీసీ కాలనీకి చెందిన టైలర్ సూరిబాబు(37), కళత్తూరుకు చెందిన సుహాసిని(32) తో దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. పెళ్లి తర్వాత  సూరిబాబు.. తన భార్యకు టైలరింగ్ కూడా నేర్పించాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.

అందరూ ఆడపిల్లల్నే క న్నావంటూ భార్యతో సూరిబాబు గొడవపడేవాడు. దీనికి తోడు భార్యను అనుమానించి వేధించేవాడు. ఐదునెలల క్రి తం భార్యాబిడ్డలను వదిలిపెట్టి  నివాసాన్ని శ్రీకాళహస్తికి  మార్చేశాడు. రోజూ కేవీబీపురం వస్తూ అద్దె భవనంలో బట్టలు కుట్టుకుంటూ జీవించేవాడు. పిల్లలను తన దగ్గరకు పంపించేయమని భార్యతో గొడవపడేవాడు. ఆమె అందుకు ఒప్పుకోకుండా టైలరింగు పనులతో పిల్లలను పోషించుకునేది. ఈ నేపథ్యంలో మంగళవారం సుహాసిని తన ఇంటికి వెళుతుండగా సూరిబాబు ఆమెను అడ్డగించి గుండెలపై కత్తితో పొడిచాడు, ఆమె కింద పడిపోవడంతో గొంతుకోసి పారిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu