జనాలతో, మీడియాతో మాట్లాడొద్దు.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌‌పై నిమ్మగడ్డ ఆంక్షలు

Siva Kodati |  
Published : Feb 11, 2021, 08:25 PM IST
జనాలతో, మీడియాతో మాట్లాడొద్దు.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌‌పై నిమ్మగడ్డ ఆంక్షలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ vs వైసీపీ ప్రభుత్వంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇరు పక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ vs వైసీపీ ప్రభుత్వంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇరు పక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.

ఇప్పటికే తన మాట వినని అధికారులపై బదిలీ వేటు వేయడమో లేదంటే విధుల నుంచి తప్పించడమో చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రులను సైతం ఆయన వదిలిపెట్టడం లేదు.

కొద్దిరోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు సంచలన సృష్టించారు. అయితే పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించి వాటిని తప్పించుకున్నారు.

Also Read:పెద్దిరెడ్డి ఇష్యూ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కి నిమ్మగడ్డ షాకిచ్చారు. ఎన్నికలయ్యే వరకు మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. అంతేకాకుండా సమావేశాల్లోనూ ప్రసంగించొద్దని ఎస్ఈసీ ఆదేశించారు.

ఈ నెల 13 వరకు ఆంక్షలు అమలవుతాయని నిమ్మగడ్డ తెలిపారు. అలాగే జనాలతో కూడా మాట్లాడొద్దని రమేశ్ కుమార్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరించారని ఆరోపణలు రావడంతో నిమ్మగడ్డ ఫైరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?