న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు.. సీబీఐకి వివరణ ఇస్తా: ఆమంచి

Siva Kodati |  
Published : Feb 11, 2021, 07:44 PM IST
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు.. సీబీఐకి వివరణ ఇస్తా: ఆమంచి

సారాంశం

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశామని కేసు పెట్టారని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. రేపు సీబీఐకి వివరణ వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. న్యాయమూర్తులను కించపరిచే ఉద్దేశం లేదని ఆమంచి తెలిపారు. 

అంతకుముందు ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది.

దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ఈ నెల 6వ తేదీని విశాఖలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.

న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ పోస్టులు పెట్టారని కేసులు నమోదయ్యాయి.

ఆమంచితో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. కొందరికి కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?