రంగంలోకి దిగిన కొత్త ఈసీ కనగరాజ్: రమేష్ కుమార్ కు నో చాన్స్

By telugu teamFirst Published Apr 11, 2020, 1:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వి. కనగరాజ్ రంగంలోకి దిగారు. గవర్నర్ హరిచందన్ మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత ఆయన తన పనిలో పడ్డారు.

అమరావతి: ఉద్వాసనకు గురైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) జస్టిస్ కనగరాజ్ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరనా పరిస్థితిపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై కూడా సమీక్ష జరిపారు. 

తాను హైదరాబాదులోని కార్యాలయం నుంచే పనిచేస్తానని చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కనగరాజ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈసీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిశారు. ఆయన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత సిబ్బందితో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వం 619 నెంబర్ జీవో జారీ అయింది. కొత్త నిబంఘధనల మేరకు రిటైర్డ్ జడ్జిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కనగరాజ్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. 9 ఏళ్లు పాటు ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్య, మహిళలు, వృద్ధుల సంక్షేమాలకుసంబంధించిన కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులు వెలువరించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ మేరకు రమేష్ కుమార్ తన పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించారు. 

click me!