వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో..ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యులను ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విశాఖ తరలించారు.
కరోనా వైరస్ విజృంభన రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఎవరి నుంచి ఎవరికి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు.. ఆ తర్వాత మరికొరికి అలా అందరికీ పాకుతోంది. ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా కూడా కొందరికి వైరస్ పాకుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
Also Read చికెన్ కోసం ఎగబడుతున్న జనం.. రేపు సంపూర్ణ లాక్ డౌన్...
కాగా.. తాజాగా ఓ స్కూల్ టీచర్ కి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ స్కూల్ విద్యార్థులంతా భయంతో వణికిపోతున్నారు. ఈ సంఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో..ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, వారి కుటుంబ సభ్యులను ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విశాఖ తరలించారు.
జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఎం ఆదేశాల మేరకు మిగిలిన 22 మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు మరో 16 మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వారిని గురువారం రాత్రే విశాఖపట్నం తీసుకువెళ్లారు. కాగా, తోటి ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో మిగిలినవారు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు సెలవులిచ్చిన తరువాత తాము సంబంధిత ఉపాధ్యాయుడిని కలవలేదని చెబుతున్నా, వారిలో భయం మాత్రం స్పష్టంగా కనపడుతోంది.
ఇక స్కూల్ విద్యార్థులపై కూడా అధికారులు దృష్టిసారించారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న 537 మంది విద్యార్థుల నివాసాలకు వెళ్లి సర్వే చేయాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేంపాడు, పరిసర గ్రామాల్లోని విద్యార్థుల ఆరోగ్య స్థితిపై వైద్య సిబ్బంది ఆరాతీశారు. ప్రత్యేక బృందాలుగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తుండటం గమనార్హం.