పిల్లల అక్రమ రవాణా: విశాఖ సృష్టి ఆసుపత్రిలో పోలీసుల సోదాలు

By narsimha lodeFirst Published Jul 29, 2020, 4:49 PM IST
Highlights

పిల్లల అక్రమ రవాణాలో కీలక కేంద్రంగా నిలిచిన యూనివర్శల్ సృష్టి ఆసుపత్రిలో బుధవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆసుపత్రి నుండి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.
 


విశాఖపట్టణం: పిల్లల అక్రమ రవాణాలో కీలక కేంద్రంగా నిలిచిన యూనివర్శల్ సృష్టి ఆసుపత్రిలో బుధవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆసుపత్రి నుండి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు.

యూనివర్శల్ సృష్టి ఆసుపత్రి ఎండీ  డాక్టర్ నమ్రతను  పిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో  ఆమె రిమాండ్ లో ఉంది. డాక్టర్ నమ్రతతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

also read:హైకోర్టులో డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్: ఈ నెల 31 విచారణకు ఛాన్స్

ఈ ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటివరకు 56 డెలీవరీలు జరిగినట్టుగా విచారణ కమిటి గుర్తించింది. ఈ అసుప్రతికి అనుబంధంగా ఉన్న మరో ఐదు ఆసుపత్రుల్లో 150 డెలీవరీలు అయ్యాయని విచారణ కమిటి గుర్తించింది.

సృష్టి ఆసుపత్రిలో ఎలాంటి రికార్డులు మెయింటైన చేయలేదని విచారణ కమిటి గుర్తించింది. ఇదే కేసులో ఇద్దరు ఆశా వర్కర్లు కూడ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్ ను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

ఆసుపత్రి నుండి కీలకమైన కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. విచారణ కమిటిలో వైద్య బృందం ఉంది. ఈ కేసులో విచారణ కమిటి నుండి దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీతో పాటు మరికొందరు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని విశాఖపట్టణం సీపీ ఆర్ కే మీనాకు సమర్పించనున్నారు.

ఇదిలా ఉంటే పిల్లల అక్రమ రవాణా కేసులో  బెయిల్ ఇవ్వాలని కోరుతూ డాక్టర్ నమ్రత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 31వ తేదీన విచారణకు రానుంది.


 

click me!