గుంటూరు: తరగతి గదిలోనే చిన్నారులకు నీలిచిత్రాలు చూపించి... నీచపు టీచర్ వికృతచేష్టలు

Arun Kumar P   | Asianet News
Published : Oct 25, 2021, 10:05 AM ISTUpdated : Oct 25, 2021, 10:29 AM IST
గుంటూరు: తరగతి గదిలోనే చిన్నారులకు నీలిచిత్రాలు చూపించి... నీచపు టీచర్ వికృతచేష్టలు

సారాంశం

తప్పు చేసిన విద్యార్థులను మందలించి బుద్దిచెప్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితక్కువ పనిచేసి అరెస్టయిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. తరగతి గదిలోనే బాలికలకు నీలిచిత్రాలు చూపిస్తూ వికృతంగా వ్యవహరించిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసారు.

గుంటూరు: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పాడు. చదువు చెప్పాల్సిన తరగతి గదిలోనే చిన్నారులతో నీచంగా వ్యవహరించాడు. అభం శుభం తెలియని బాలికలకు బూతు సినిమాలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... guntur district సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ లో ఎంపిపిఎస్(ఉర్దూ) పాఠశాల నడుస్తోంది. ఈ స్కూల్లో హుస్సెన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే చదవు  చెప్పాల్సిన తరగతి గదిలోనే నీలి చిత్రాలను చూడటమే కాదు చిన్నారులకు చూపించి లైంగికంగా వేధించేవాడు. ఇలా చాలారోజులుగా అతడు blue films చూపించి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా వారు బయటకు చెప్పుకోలేకపోయారు. 

అయితే తాజాగా ఓ విద్యార్థిణి తలనొప్పిగా వుందని సాకులు చెప్పి స్కూల్ కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో తల్లి ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి బయటపెట్టింది. ప్రతిరోజూ బూతు సినిమాలు చూపించి వేధిస్తున్నాడంటూ టీచర్ హుస్సెన్ పాడుపనుల గురించి బయటపెట్టింది. దీంతో ఆమె మిగతా విద్యార్థిణులను కూడా ఆరాతీయగా తమను కూడా ఇలాగే వేధిస్తున్నాడని బయటపెట్టారు. 

read more  ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తమోడుతున్న పాపతో 5 ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తండ్రి... పరిస్థితి విషమం...

బాలికల తల్లిదండ్రులంతా కలిసి సదరు ఉపాధ్యాయున్ని ప్రశ్నించగా వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ నీచుడిని తమకు అప్పగించాలంటూ విద్యార్థిణుల తల్లిదండ్రులు, స్థానికులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.

విద్యాశాఖ అధికారులకు కూడా హుస్సెన్ వ్యవహారంపై సిరియస్ అయ్యింది. అతడిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని... లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదిలావుంటే ఇదే గుంటూరు జిల్లాలో ఓ మానసిక వికలాంగురాలిపై ఓ కామోన్మాది అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్య సహకారంతోనే ఈ వ్యవహారం సాగడం గమనార్హం. చాలారోజులుగా అఘాయిత్యం జరుగుతున్నా బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది.  

గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల మానసిక వికలాంగురాలు. సదరు బాలిక తాతకు స్నేహితుడైన చిట్టిబాబు బాలిక ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే బాలిక నిస్సహాయ పరిస్థితిని గమనించిన అతడు ఆమెపై కన్నేసాడు. భార్య సాయంతో బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురి కావడంతో  ఆస్పత్రిలో చూపిస్తే గర్భవతి అన్న విషయం తెలిసింది. షాక్ కు గురయిన కుటుంబసభ్యులు ఆరా తీయగా  చిట్టిబాబు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu