మహిళా ఉద్యోగినిపై ఏలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ లైంగిక వేధింపులు.. దిశా పోలీసులకు ఫిర్యాదు..

By team teluguFirst Published Oct 25, 2021, 9:42 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కార్యాలయంలోని మహిళా ఉద్యోగిపై సబ్ రిజిస్ట్రార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కార్యాలయంలోని మహిళా ఉద్యోగిపై సబ్ రిజిస్ట్రార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మహిళా ఉద్యోగి సబ్ రిజిస్ట్రార్ ప్రశ్నించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మహిళ దిశా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

దిశా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ వీ రామకొటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్ రిజిస్ట్రార్ డి జయరాజ్ ఐదు నెలల క్రితం ఏలూరుకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అంతకు ముందు అతడు ఐ పోలవరం‌లో విధులు నిర్వర్తించేవాడు. అయితే Eluru sub-registrarగా బాధ్యతులు చేపట్టిన తర్వాత జయరాజ్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగినిపై sexual harassment దిగాడు. సామాజిక అవమానానికి భయపడి ఆమె వేధింపులను భరించింది. అయితే ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకున్న జయరాజ్ మరింతగా వేధించడం మొదలుపెట్టాడు.  

ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితం బాధిత మహిళా ఉద్యోగి ఉన్నతాధికారులకు జయరాజ్‌పై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఓ ఉన్నతాధికారి జయరాజ్‌‌ను ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ జయరాజ్ తన పద్దతి మార్చుకోలేదు. తిరిగి ఆ మహిళా ఉద్యోగిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక మహిళా ఉద్యోగి జయరాజ్‌పై దిశా పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. తనను బయట కలవాలని కోరేవాడని ఆరోపించింది. 

Also read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. అక్టోబరు జీతాల్లో కోత..!

ఆమె ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్ జయరాజ్‌పై సెక్షన్ 354 A కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. దిశా మార్గదర్శకాల ప్రకారం రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగి సబ్ రిజిస్ట్రార్ జయరాజ్‌ను వేధింపులపై ప్రశ్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని టీవీ చానల్స్‌లు కూడా ఈ వీడియోను ప్రసారం చేశాయి. ఈ వీడియోలో మహిళా ఉద్యోగి ప్రశ్నిస్తుంటే.. జయరాజ్ కుర్చీ వెనకాల దాక్కుని కనిపించాడు.  

click me!