గతంలో కూడా ఈ మూడు గ్రామాల్లో ఎన్నికలు: సుప్రీంలో ఏపీ వాదన

Published : Feb 19, 2021, 02:20 PM IST
గతంలో కూడా ఈ మూడు గ్రామాల్లో ఎన్నికలు: సుప్రీంలో ఏపీ వాదన

సారాంశం

ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారించింది.తమ భూబాగంలోని మూడు గ్రామపంచాయిితీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా ప్రభుత్వం పిటిషన్ వేసింది.ఈ పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం తరపున విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.  కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఏపీ రాష్ట్రంలో భాగమేనని ఆయన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

గతంలో కూడ ఏపీ సర్కార్ ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అరకు పార్లమెంట్, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిల్లో మూడు గ్రామాలు వస్తాయన్నారు. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేయాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు సమాధానం చెప్పేందుకు సమయం కావాలని ఒడిశా కోరింది.  దీంతో ఈ కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే