ఎన్నికల్లో వలంటీర్ల సేవలపై కోర్టుకు వెళ్తా :జేసీ ప్రభాకర్ రెడ్డి

Published : Feb 19, 2021, 01:36 PM IST
ఎన్నికల్లో వలంటీర్ల సేవలపై కోర్టుకు వెళ్తా :జేసీ ప్రభాకర్ రెడ్డి

సారాంశం

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ విషయమై అవసరమైతే హైకోర్టును కూడ  ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ విషయమై అవసరమైతే హైకోర్టును కూడ  ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. వలంటీర్లలో 90 శాతం తమ పార్టీకి చెందినవారేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. వలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకోవద్దని తాను కలెక్టర్ ను కోరుతానని ఆయన చెప్పారు.ఇదే విషయమై ఎస్ఈసీని కలిసి వినతి పత్రం సమర్పిస్తానన్నారు. అంతేకాదు ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

తమ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కలెక్టర్, ఎస్పీ చాలా పకడ్బందీగా వ్యవహరించారని ఆయన చెప్పారు. అయితే  రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చిన ఫలితాలు సరైనవి కావన్నారు.

కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న వారిని మేనేజ్ చేసి ఫలితాలు ప్రకటించారన్నారు. తాడిపత్రిలో వలంటీర్ల సేవలను ఎన్నికల్లో ఉపయోగిస్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 

50 ఇళ్లకు ఒక్క వలంటీర్లను నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందవని చెబుతున్నారన్నారు. వలంటీర్లే రాష్ట్రంలో రాజకీయ నేతలుగా ఆయన చెప్పారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్