
బౌద్ధ చారిత్రక ప్రదేశంగా పేరొందిన తొట్ల కొండలో ఏలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.ప్రొఫిసర్ తిమ్మారెడ్డి మరో ఇద్దరు వేసిన పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, ఎ. శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం విశాఖపట్నంలోని కాపులపాడు గ్రామం ప్రాంతంలోని తొట్లకొండ వద్ద ఏలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొంది. అక్కడి యథాతథ కొనసాగించాలని ఆదేశించింది.
బౌద్ధచారిత్రక ప్రదేశమైన తొట్ల కొండలో 15 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కోసం కేటాయించింది.
అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బౌద్ధ చారిత్రక ప్రాంతాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రొఫిసర్ తిమ్మారెడ్డి మరో ఇద్దరు కలసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తొట్లకొండ ప్రాంతాన్ని పరిరక్షించాలని తమ పిటిషన్ లో కోరారు.