సంసారంలో చిచ్చు రేపిన టిక్‌టాక్‌: మొదటి భార్య హత్యకు యత్నం, చివరికిలా..

By narsimha lodeFirst Published Oct 27, 2019, 2:01 PM IST
Highlights

పచ్చని సంసారంలో టిక్ టాక్ చిచ్చును రేపింది. విజయవాడలో ఈ ఘటన చోట చేసుకొంది. టిక్ టాక్ ద్వారా  పరిచయమైన మహిళను వీటీపీఎస్ ఉద్యోగి సత్యరాజ్ పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన మొదటి భార్య అతడిపై కేసు పెట్టింది.


విజయవాడ:టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. అయితే తనకు పెళ్లైన విసయాన్ని దాచిపెట్టి మరో పెళ్లి చేసుకొన్నాడు. అంతేకాదు రెండో పెళ్లి విషయం తెలుసుకొన్న మొదటి  భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న మొదటి భార్య అతనిపై కేసు పెట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకొంది.

Also Read:టిక్ టాక్ లో ఫేమస్ విలన్... తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో వీటీపీఎస్‌లో సత్యరాజ్ పనిచేస్తున్నాడు. సత్యరాజ్‌కు పెళ్లైంది. కానీ, సత్యరాజ్  మాత్రం తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టాడు. ఏడాదిగా టిక్ టాక్ చేస్తున్న సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా ఆ మహిళతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు.

"

టిక్ టాక్‌లో పరిచయం ఉన్న మహిళను సత్యరాజ్‌ ఇటీవలనే తిరుపతిలో పెళ్లి చేసుకొన్నాడు. భర్త సత్యరాజ్ ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయాన్ని భార్య  అనురాధ గుర్తించింది. ఇదే విషయాన్ని భర్తను నిలదీసింది. అతను సమాధానం ఇవ్వలేదు.

"

ఆదివారం నాడు భర్త సత్యరాజ్‌ మరో మహిళను పెళ్లి చేసుకొన్నాడని అనురాధకు తెలిసింది. ఈ విషయమై భర్తను నిలదీసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

"

తాను రెండో పెళ్లి చేసుకొన్న విషయాన్ని గుర్తించిందని అనురాధను చంపేందుకు భర్త సత్యరాజ్ ప్రయత్నించాడు. అయితే భర్త సత్యరాజ్ నుండి అనురాధ తప్పించుకొంది.

"

భర్త నుండి తప్పించుకొన్న అనురాధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని అనురాధ పోలీసులను కోరింది.టిక్ టాక్  తన కుటుంబంలో చిచ్చును రేపిందని  అనురాధ వాపోయింది.

"

టిక్ టాక్ ద్వారా  అనేక ఘటనలు చోటు చేసుకొన్నాయి. టిక్ టాక్ లో వీడియోల కోసం కొందరు వీడియోలు రికార్డు చేస్తున్న సమయంలో ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. సెల్పీ కోసం వీడియోలు తీసుకొంటూ ప్రమాదాలకు గురై మరణించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో   సోషల్ మీడియాలో ప్రచారం కోసం చాలామంది ప్రమాదాలను కొనితెచ్చుకొన్నారు.తాజాగా విజయవాడలో మాత్రం టిక్ టాక్ సంసాారంలో చిచ్చు పెట్టింది.

కొందరు టిక్ టాక్ ను వ్యసనంగా మార్చుకొన్నారు. దీంతో కొందరు భార్యాభర్తలు విడాకులు తీసుకొన్నారు.మరికొందరు టిక్ టాక్ కు బానిసగా మారిన వారు కుటుంబసభ్యులు హెచ్చరించడంతో ఆత్మహత్యలకు కూడ పాల్పడ్డారు.

టిక్ టాక్ వద్దన్నందుకు వనపర్తి జిల్లాలో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. సోషల్ మీడియాను మంచికి అనుకూలంగా మలుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


 

click me!