హాట్ టాపిక్‌గా గన్నవరం రాజకీయాలు: కార్యకర్తలతో వంశీ, యార్లగడ్డ భేటీ

By sivanagaprasad KodatiFirst Published Oct 27, 2019, 10:41 AM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు దండిగా ఉండటంతో వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అలర్టయ్యారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో వెంకట్రావు ఆదివారం భేటీకానున్నారు. మరోవైపు ఎమ్మెల్య వంశీ సైతం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో విడి విడిగా సమావేశమవుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరం రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు దండిగా ఉండటంతో వైఎస్సార్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అలర్టయ్యారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో వెంకట్రావు ఆదివారం భేటీకానున్నారు. మరోవైపు ఎమ్మెల్య వంశీ సైతం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో విడి విడిగా సమావేశమవుతున్నారు. 

Also Read:జగన్ , భారతమ్మలపై కేసులు పెట్టారు... వల్లభనేని వంశీపై యార్లగడ్డ కామెంట్స్

ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి. 

వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు. 

వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read:వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డకు జగన్ హామీ ఇదే !

వంశీ జగన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుక్షణం యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారంనాడు యార్లగడ్డ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని  ఆందోళన చెందుతున్న యార్లగడ్డ  మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు. 

వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.

click me!