ఆయేషా మీరా కేసులో నిర్ధోషీగా విడుదలైన సత్యం బాబు తనకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును కలిసి సోమవారం నాడు వినతి పత్రం సమర్పించారు.
విజయవాడ: బీ. ఫార్మసీ విద్యార్ధిని Ayesha Meera కేసులో నిర్ధోషిగా విడుదలైన తనకు పరిహారం చెల్లించాలని సత్యం బాబు ప్రభుత్వాన్ని కోరారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును Satyam Babu సోమవారం నాడు కలిశారు.స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ Delhi Rao కు సత్యం బాబు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. రెండు ఎకరాల సాగు భూమితో పాటు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆ వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు.చేయని నేరానికి తాను 9 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించినట్టుగా సత్యం బాబు చెప్పారు. ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని కూడా ఆయన ఆ వినతి పత్రంలో కోరారు. ఆయేషా మీరా కేసులో తనను హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించినందున పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
2007 డిసెంబర్ 27న B.Pharmacy విద్యార్ధిని ఆయేషా మీరాను విజయవాడలోని హాస్టల్ లో దారుణ హత్యకు గురైంది. బాత్రూంలోని రక్తంం మడుగులో ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది.తన ప్రేమను తిరస్కరించడంతోనే హత్య చేసినట్టుగా ఓ లేఖ కూడా లభ్యమైంది. అత్యాచారం చేసి ఆయేషా మీరాను హత్య చేశారు.
undefined
ఈ కేసులో krishna District జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యం బాబుని నిందితుడిగా గుర్తించి 2008 ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నేరస్థులను రక్షించే ఉద్దేశ్యంలో భాగంగా సత్యం బాబును అరెస్ట్ చేశారంటూ అతడి బంధువులు, మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు. జైలులో ఉన్న సమయంలో సత్యం బాబుకు అనారోగ్యం కారణంగా పక్షవాతం వచ్చింది. మరోవైపు సత్యం బాబు జైలు నుంచి తప్పించుకున్నాడని, అతడిని మళ్లీ అరెస్టు చేసినట్టుగా కూడా పోలీసులు అప్పట్లో తెలిపారు.
also read:ఆయేషా మీరా కేసుపై సత్యంబాబు: అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు
ఆయేషా మీరా కేసులో Vijayawada మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబుకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై బాధితుడు High Court లో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు సత్యం బాబును నిర్ధోషిగా ప్రకటించింది.అంతేకాకుండా దర్యాప్తు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బాధితుడికి పరిహారంగా రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని సత్యం బాబుకు హైకోర్టు సూచించింది.ఈ నేపథ్యంలో సత్యంబాబు ఇవాళ కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఇదే విషయమై ఎస్సీ కమిషన్ కు కూడా సత్యం బాబు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సీ కమిషన్ నిర్వహించిన విచారణకు 2021 నవంబర్ 18న హాజరయ్యారు. జైలులో ఉండటం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని నివేదించారు. క్రిమినల్ అని ముద్ర వేయడంతో సామాజిక బహిష్కరణకు గురయ్యామని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమంగా కేసు పెట్టి తొమ్మిదేళ్లు జైల్లో ఉంచిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యంబాబు కోరుకున్న విధంగా రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.