తొమ్మిదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అఘాయిత్యం

Published : Jul 04, 2020, 08:21 AM ISTUpdated : Jul 04, 2020, 08:24 AM IST
తొమ్మిదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అఘాయిత్యం

సారాంశం

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో స్థానిక వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. కేసు మాఫీ చేసేందుకు వైసీపీ నేతలు, గ్రామ పెద్దల యత్నాలు చేస్తున్నారు. ఈ

అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది. 9వ తరగతి విద్యార్థినిపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో స్థానిక వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. కేసు మాఫీ చేసేందుకు వైసీపీ నేతలు, గ్రామ పెద్దల యత్నాలు చేస్తున్నారు. ఈ దారుణం మీడియాలో ప్రసారంలో కావడంతో ఈ ఘటనపై మహిళా కమిషన్‌ వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. కఠినచర్యలు తీసుకోవాలని పుంగనూరు డీఎస్పీని పద్మ కోరారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు