టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా: కన్నీళ్లను అదుముకొంటూ

By narsimha lode  |  First Published Mar 10, 2020, 3:06 PM IST

:కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబునాయుడుకు తనకు కొంత కాలంగా గ్యాప్ వచ్చిన విషయాన్ని సతీష్ రెడ్డి ప్రకటించారు.
 


కడప:కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబునాయుడుకు తనకు కొంత కాలంగా గ్యాప్ వచ్చిన విషయాన్ని సతీష్ రెడ్డి ప్రకటించారు.

మంగళశారం నాడు  వేంపల్లిలో సతీష్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్యలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  పార్టీకి చెందిన నేతలతో   సతీష్ రెడ్డి సమావేశమయ్యారు. 

Latest Videos

 ఈ సమావేశంలో సతీష్ రెడ్డి పార్టీలో చోటు చేసుకొన్నపరిణామాలను ప్రస్తావించారు. టీడీపీలో తాను వివక్షకు గురైనట్టుగా చెప్పారు.   కొంత కాలంగా చంద్రబాబుకు తనకు మధ్య గ్యాప్‌ పెరిగిందన్నారు. ఈ గ్యాప్ పెరుగుతోందన్నారు.

Also read:చంద్రబాబుకు షాక్: టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా

చంద్రబాబు  ఆలోచనల మేరకు తాను పార్టీలో పనిచేయలేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, పార్టీ కోసం తాను ఎక్కడా కూడ శక్తివంచన లేకుండా పనిచేశానని ఆయన గుర్తు చేశారు. 

కార్యకర్తల సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సమయంలో  తనకు వస్తున్న దు:ఖాన్ని అదిమిపెట్టుకొన్నాడు.  అతి కష్టం మీద తాను చెప్పాలనుకొన్న అంశాలను ఆయన కార్యకర్తలకు వివరించారు.

తన రాజకీయ భవిస్యత్తు గురంచి అందరిని  పిలిచి చెబుతానని సతీష్ రెడ్డి ప్రకటించారు. టీడీపీలో తాను వివక్షకు గురైనట్టుగా ఆయన ప్రకటించారు.  ఈ కారణంగానే ఆయన పార్టీని  వీడాలని నిర్ణయం తీసుకొన్నారు.
 

click me!